ఉపాధ్యాయ పదోన్నతులు లేనట్లే..?
ఏకీకృత సర్వీసు నిబంధనలపై స్టేటస్ కో ఉండటంతో యాజమాన్యం వారీగా పదోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు అవకాశాలు, అవరోధాలపై ఉపముఖ్యమంత్రి కడియం అదనపు అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలపై ఉపాద్యాయ జేఏసీలు, విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పదోన్నతులు చేపట్టకపోవడమే మేలని, యాజమాన్యం వారీగా బదిలీలకు ఇబ్బంది లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. ఏఏజి సలహామేరకు బదిలీలు మాత్రమే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. జూన్ 6 నుంచి 10వరకు ఆన్ లైన్ అప్లికషన్లు స్వీకరించి, 12నాటికి లిస్టులు ప్రకటించనున్నారు. జూన్ 20నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు.
పంచాయతీ ఎన్నికల అనంతరం అంతర్ జిల్లా స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు నిర్వహిస్తామని కడియం తెలిపారు. షెడ్యూల్ మాత్రం ముందే ప్రకటించనున్నారు.