ఏ కీలుకి ఆ కీలు తీసే.. వకీల్ ఇతను !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే.. కొందరి స్పీచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ జాబితాలో మొదట ఉండే వ్యక్తి త్రివిక్రమ్. అయితే ఈసారి త్రివిక్రమ్ పవన్ అభిమానులని నిరాశపరిచారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆయన రాలేదు. కారణం ఏంటీ ? అన్నది మాత్రం తెలీదు. ఇక త్రివిక్రమ్ తర్వాత పవన్ గురించి గొప్పగా, కమ్మగా మాట్లాడే వాళ్లలో దర్శకుడు హరీష్ శంకర్, నితిన్.. తదితరులు ఉంటారు. బండ్ల గణేష్ ఉన్నా.. ఆయన కాస్త ఓవర్ చేసినట్టు.. భజన చేసినట్టు అనిపిస్తుంటుంది. కానీ.. బండ్ల స్పీచ్ ని పవన్ తో సహా అందరూ.. ఎంజాయ్ చేస్తుంటారు.
త్రివిక్రమ్ తర్వాత పవన్, ఆయన వ్యక్తిత్వం, ఆయన సినిమాల గురించి బాగా మాట్లాడే వ్యక్తి దర్శకుడు హరీష్ శంకర్. తాజాగా జరుగుతున్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ హరీష్ రావు మాటల్లో.. ఆయనకు పవన్ పై ఉన్న అభిమానం కనబడింది. చాలా చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండగ ఇది. అందుకే మీ తరుపున, నా తరుపున వెల్ కమ్ బ్యాక్ సర్ అంటూ.. పవర్ స్టార్ కి స్వాగతం పలికారు హరీష్. పవన్ సినిమాని వదిలేద్దామనుకొన్నా.. ఆయన్ని సినిమా వదలదు. ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేసినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ? పవన్ సినిమాలు చేస్తే.. వందల కోట్ల టర్నోవర్ అవుతూ.. వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది అన్నారు.
అంతేకాదు.. హరీష్ స్పీచ్ లో సుతిమెత్తని వార్నింగ్ కూడా వినిపించింది. ఏ కీలుకి ఆ కీలు తీసే వకీల్ ఇతను. అతనికి వాయించడమే కాదు.. వాదించడమే తెలుసు. వాయించడమా ? వాదించడమా ?? ఏదో కావాలో అవతలి వాళ్ల బిహేవియర్, వాళ్ల ఆప్షన్ కి వదిలేస్తున్నాం అన్నారు. ఇక వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తయిన తర్వాత పవన్ ని కలిశాను. ఆయన మొహం తృప్తి కనిపించింది. ఆ తృతి ఏంటో.. ఈ నెల 9న థియేటర్స్ లో చూడబోతున్నాం అన్నారు.