వకీల్ సాబ్’పై డౌట్స్.. అన్నీ క్లియర్ !

వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ వారమే (ఏప్రిల్ 9)న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే వకీల్ సాబ్ పై ప్రేక్షకుల్లో కొన్ని డౌట్స్ ఉండేవి. సినిమాలో పవన్ ఎన్ని లుక్స్ లో కనిపిస్తారు. సినిమాలో శృతిహాసన్ క్లాసిక్ డ్యాన్సర్ నా ? ఇలా చాలా విషయాలపై క్లారిటీ వస్తే బాగుణ్ను అని అభిమానులు ఆశపడ్డారు. వారి కోరికని యాంకర్ సుమ తీర్చేశారు. ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు వేణు శ్రీరామ్ కి కొన్ని ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. అభిమానుల డౌట్స్ తీర్చారు.

ఈ సినిమాలో పవన్ ఎన్ని లుక్స్ లో కనిపిస్తారు ? నాలుగా.. ?? మూడా.. ?? అని అడిగారు. పవన్ మూడు లుక్స్ నే కనిపిస్తారని వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో శృతి హాసన్ క్లాసిక్ డ్యాన్సర్ నా ? అంటే .. కాదు. బయటికి వచ్చిన పిక్ షూటింగ్ సమయంలో థమన్ సరదాగా తీసినది అని తెలిపారు. సెకాంఢాఫ్ లో చూపించబోయే సప్రైజ్ ఏంటీ ? అంటే.. ఆ సపైజ్ ని థియేటర్స్ లో సినిమా చూసి తెలుసుకోండని చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు దర్శకుడు. ఇక సినిమాలో పవన్ ఎంట్రీ ఎప్పుడు.. ఏ సమయంలో ఉంటుంది ? ఆ ప్రశ్నకు కూడా సినిమా చూసి తెలుసుకోండని సమాధానం ఇచ్చారు. మొత్తానికి వకీల్ సాబ్’పై కొన్ని డౌట్స్ తీరిపోయాయ్. మిగిలినవి మాత్రం థియేటర్స్ లో సినిమా చూసి తీర్చుకోవాల్సిందే.