వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఓ అద్భుతం !

 ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ అద్బుతం జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా డ్రమ్స్ వాయించారు. శివమణి కోరిక మేరకు స్టేజ్ పైకి వచ్చి పవన్ డ్రమ్స్ వాయించారు. ఆ సీన్ ని.. అక్కడ ఉన్న అభిమానులు.. టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. పవన్ కూడా సరదాగా కనిపించారు.

దీని గురించి పవన్ తన స్పీచ్ లో ప్రస్తావించారు. శివమణి.. శివ స్వరూపుడు. ఇందాక ఆయన డ్రమ్స్ వాయించమని పిలిస్తే.. సరదాగా ఆ పని చేశాను. స్టిక్స్ పట్టుకొని డ్రమ్స్ వాయించినట్టు చేసి నిలబడిపోయా. శివ స్వరూపుడైన శివమణి.. పక్కన నిల్చుని మనం ఏం వాయించగలం. రాని పని రాదన్నట్టు కామ్ గా ఉండటమే మేలు అన్నారు పవన్.

ఇక వకీల్ సాబ్ సినిమా చేయడానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్.. ఆయనకి థ్యాంక్స్ అన్నారు పవన్. దిల్ రాజు పింక్ తెలుగు రిమేక్ ని మీతో చేయాలనుకుంటున్నారని మొదట త్రివిక్రమ్ చెప్పారు. ఆ తర్వాత దిల్ రాజుని తనని కలవమని చెప్పారు. అలా.. ఈ సినిమా ఫిక్సయింది. దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమా బాగా తీశారు. థమన్ మంచి సంగీతం ఇచ్చారు. వకీల్ సాబ్ మిమ్మల్ని అలరిస్తుందని ఆకాంక్షిస్తున్నా అన్నారు పవన్.