వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ హిట్ !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భక్తుల్లో మొదటి భక్తుడు బండ్ల గణేష్. ఆ భక్తిని అప్పుడప్పుడు బయటికి చూపిస్తుంటాడు బండ్ల. ముఖ్యంగా పవన్ సినిమా ఫంక్షన్స్ లో. ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ తన బాస్ పవన్ పై బండ్ల భక్తిని చూపించారు. వీరభక్తిని చూపించారు. మొత్తం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే బండ్ల స్పీచ్ నే హైలైట్. బ్లాక్ బస్టర్ హిట్. అంటే బండ్ల చేసిన మాయ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బండ్ల మాట్లాడుతుంటే.. పవన్ కళ్లలో నీళ్లు తిరిగినంత పనైంది. బహుశా.. అవి ఆనంద భాష్పాలేమో.. !
‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..’. నిజంగా.. పవన్ కల్యాణ్ ఓ వ్యసనం. నీయమ్మా.. అలవాటు చేసుకుంటే కష్టం. సచ్చిపోయేదాక.. బూడిదయ్యేదాక వదల్లేం. వదిలించుకోలేం. అంతే. కొన్ని జన్మలు అంతే. కొందరిని ఇష్టపడటమే.. గానీ వదులుకోవడం ఉండదు.. అంటూ తనదైన శైలిలో బండ్ల తన స్పీచ్ ని మొదలెట్టారు. రాజకీయాల్లో పవన్ పై వస్తున్న విమర్శలకు సుతిమెత్తిగా సటైర్స్ వేశారు. ఇటీవల నా స్నేహితుడొకడు.. ఏంటీ మీ బాస్ ఓ సారి రాజకీయాలు అంటాడు.. మరోసారి సినిమాలు అంటాడు. నిలడలేదు అన్నారు.
దానికి నేను సమాధానం ఇస్తూ.. ‘మనలాగ కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, విడిది వ్యాపారం, విస్కి వ్యాపారం ఆయనకు లేదుగా. ఆయన వద్ద ఉంది ఒక్కటే. బ్లెడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి. చెమటని నటనగా మార్చి.. జనానికి అందరికీ అందించి.. ఆయన్ని నమ్ముకున్న వాళ్లకి కోటి రూపాయనే ఆయన రక్తాన్ని చిందించి.. సంపాందించిన డబ్బుతో ఇన్సురెన్స్ చేయించిన క్యారెక్టర్ పవన్ కల్యాణ్ ది… ఏం మాట్లాడుతున్నావ్ రా లఫూట్’ అన్నానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే..? నా దేవుడిని విమర్శిస్తే తట్టుకోలేకపోయా. అందుకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చానన్నారు.
అలాగే పవన్ నడక,నడత.. ఆయనకున్న దేశ భక్తిని పోలిస్తూ.. పవన్ బండ్ల చేసిన ప్రంసంగంతో వేదిక దద్దరిల్లిపోయింది. పవన్ సహా.. ఫంక్షన్ కి వచ్చిన ప్రముఖులు, ప్రేక్షకులు బండ్ల స్పీచ్ సునామీలో ఊగిపోయారు. తడిసిముద్దైపోయారు. ఇకపై పవన్ సినిమా ఫంక్షన్ అంటే.. బండ్ల స్పీచ్ తప్పనిసరి. లేదంటే.. అభిమానులు హర్ట్ అవుతారు. అంతలా.. పవన్ అభిమానులకు వ్యసనంలా మారారు బండ్ల. నిన్నటి బండ్ల స్పీచ్ విన్నాక.. ఆయన పవన్ వీర భక్తుడు. పవన్ కు ఆంజనేయుడు అని నమ్మి తీరాల్సిందే. ఇంకా నమ్మని వారు.. కింద బండ్ల స్పీచ్ ని వినండీ.. ! అప్పుడు సచ్చి నమ్మి తీరుతారు… !!