నిధితో ఏమీ లేదు
క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరు ముంబయిలోని ఒక రెస్టారెంట్లో విందు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో రాహుల్-నిధి ల మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ వార్తలొచ్చాయి.
తాజాగా, ఈ ప్రచారంపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నిధి, తాను స్నేహితులు మాత్రమే. తమ మధ్య అంతకుమించి ఏమీ లేదు. ఆమె నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఇద్దరం ఒకే నగరం నుంచి వచ్చాం. తన రంగంలో ఆమె ఎదుగుతుండటం చాలా సంతోషం. తనతో పాటు విందులో పాల్గొన్నది నేనొక్కడినే కాదు. అక్కడ బెంగళూరు వాళ్లే ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదని హామీ ఇస్తున్నా’నని తెలిపాడు. నేను ఓ అమ్మాయిని ఇష్టపడితే అందరికీ కచ్చితంగా చెబుతా. ఆ అమ్మాయిని దేవతలా చూసుకుంటా. అందులో దాచేదేమీ లేదని చెప్పుకొచ్చాడు. మరీ.. ఇప్పటికైనా రాహుల్-నిధిలపై జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.