చిరుని తీసుకొచ్చాడు.. కలెక్షన్స్ పెరుగుతాయా ?

కింగ్ నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రానికి అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో తెరకెక్కింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. గత వారమే (ఏప్రిల్ 2) వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెగటివ్ టాక్ రాలేదు. అలాగని హిట్ టాక్ రాలేదు. ఓ మోస్తరు అనేశారు.


టాక్ తో సంబంధం లేకుండా వైల్డ్ డాగ్ మొరగడం లేదు. కలెక్షన్స్ రోజురోజుకి తగ్గిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో నాగ్ మెగా ప్లాన్ వేశారు. సోమవారం మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. వైల్డ్ డాగ్ ను ప్రత్యేకంగా చూసిన చిరంజీవి, ఆ సినిమాను ఆకాశానికెత్తేశారు. నాగార్జున నిబద్ధతను, దర్శకుడి పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని కోరారు. మరీ.. మెగాస్టార్ రాకతో వైల్డ్ డాగ్ కలెక్షన్స్ పెరుగుతాయా ? అన్నది చూడాలి.