పోలింగ్ రోజున చిన్నమ్మకు షాక్

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పనుంది అనుకున్నారంతా. తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత స్థానంలో కీలక పాత్ర పోషిస్తారనుకున్నారు. ఐతే శశికళ..అనూహ్యంగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రకటన ప్రతిఒక్కరిని ఆశ్చర్యపర్చింది. దాంతో తమిళనాడులో అధికారం కోసం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు నడుస్తోంది. 

234 నియోజకవర్గాలకు ఈరోజు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే లతో పాటు కమల్‌ హాసన్ పార్టీ భవితవ్యాన్ని నేడు ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అయితే పోలింగ్ రోజున చిన్నమ్మ శశికళకు షాక్ తగిలింది. ఆమె తన ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఇందుకు కారణం. దీనిపై శశికళ తీవ్ర మనస్థాపం చెందారని.. ఆమె తరఫు న్యాయవాది ఎన్ రాజా తెలిపారు.