AlluArjunBirthdayCDP వచ్చేసింది !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి గుడ్ న్యూస్. #AlluArjunBirthdayCDP వచ్చేసింది. ఎల్లుండే (ఏప్రిల్ 8) బన్నీ బర్త్ డే. ఐతే, నెల క్రిందటి నుంచే బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు ఆయన అభిమానులు. ఇప్పుడీ.. వాటిని మిల్కీ బ్యూటీ తమన్నా పీక్స్ కి తీసుకెళ్లింది. అవునూ.. తాజాగా #AlluArjunBirthdayCDP తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో.. #AlluArjunBirthdayCDP ట్రెండింగ్ లోకి వచ్చేసింది. లైకులు, షేర్స్, రీ ట్విట్స్ తో హోరెత్తిస్తున్నారు.


ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. రష్మిక మందన హీరోయిన్. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇక బన్నీ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి బన్నీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. పుష్ప తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తికాగానే.. బన్నీ సినిమా పనులని మొదలెట్టనున్నారు కొరటాల.