కరోనా ఉదృతి.. గ్రేటర్ లో ఆంక్షలు ?

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో థియేటర్స్, బార్లు, క్లబ్ లు యధాథతంగా నడవడంపై  మంగళవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఇదీగాక.. తెలంగాణలో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 2వేలకు చేరువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,914 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కరోనా ఉదృతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. థియేటర్స్, బార్లు, క్లబ్ లపై కూడా ఆంక్షలు ఉండొచ్చని సమాచారమ్.