చిరుపై ఆగ్ర‌హంతో పవన్ ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం చిరు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించడమే. ఇటీవల సీఎం  జగన్ చిత్ర పరిశ్రమపై వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు జ‌గ‌న్‌ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఏపీలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. 


ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు) విద్యుత్‌ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేసింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్ చేసిన పనిని మెగాస్టార్ చిరంజీవి అభినందించకుండా ఉండలేకపోయారు. చిరు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ని అభినందించారు. చిరు మాత్రమే కాదు.. నాగ్ కూడా జగన్ ని ప్రశంసించారు.


ఇదే పవన్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం జగన్ ని పవన్ టార్గెట్ ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరు సీఎం జగన్ ని గొప్పగా పొగడటం వారిని నచ్చడం లేదు. దీంతో చిరుపై ఆగ్రహంతో ట్రోల్ చేస్తున్నారు. కొందరు పవన్ ఫ్యాన్స్ అయితే చిరుపై అభ్యంతర కామెంట్స్ కూడా వదులుతున్నారు. వాస్తవానికి.. రాజకీయాలు, సినిమాలని వేరుగా చూస్తుంటారు. అన్నయ్య చిరు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించడాన్ని పవన్ పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్, పవన్ అన్నయ్య అని కూడా చూడకుండా టార్గెట్ చేయడం గమనార్హం.