కరోనా ఎఫెక్ట్.. ‘టీ20 వరల్డ్ కప్’ విదేశాలకు తరలింపు ?
టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే గత యేడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కరోనా విజృంభణతో.. ఈ యేడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ యేడాది అక్టోబర్-నవంబర్లో మెగాటోర్నీ జరగాల్సి ఉంది. ఐతే దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ భారత్ లో నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంళో టీ20 ప్రపంచకప్‌నకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్డిస్ తెలిపారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారమే ప్రపంచకప్ జరగాలని కోరుకుంటున్నాం. ప్రత్యామ్నాయ ప్రణాళికా కూడా సిద్ధంగానే ఉంది. దానిపై ఇప్పుడే ముందుకు వెళ్లం. బీసీసీఐతో కలిసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. అంతా సవ్యంగా సాగుతుందనే అనుకుంటున్నాం. పరిస్థితి నియంత్రణలో లేకపోతే టీ20 ప్రపంచకప్ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని పరిశీలిస్తాం అని అలార్డిస్ తెలిపాడు.