మళ్లీ తెరపైకి జబర్దస్త్ వినోద్ ఇంటి గొడవ
అచ్చం అమ్మాయిలా బుల్లితెరపై సందడి చేసే జబర్థస్త్ వినోద్ ఇంటి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జబర్థస్త్ వినోద్ అద్దెకు ఇంటిని.. ఆయన ఖరీదు చేసుకున్నారు. రూ. 40లక్షలకు బేరం కుదిరింది. ఇప్పటికే రూ. 13.40లక్షలు యజమానికి ముట్టాయి. మిగితా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో గతంలో వినోద్ పై యజమాని దాడి చేసిన సంగతి తెలిసిందే. గాయాలతో వినోద్ ఆసుపత్రిలో చేరారు. దానికి సంబంధించిన వార్త అప్పట్లో వైరల్ అయింది.
తాజాగా ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని జబర్దస్త్ వినోద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ‘ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తామని యజమాని రూ.40లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారు” అని వినతిపత్రంలో తెలిపారు.