సీఎంకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కొత్త కేసులు.. వందలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. సామాన్యులు మాత్రమే సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. చికిత్స నిమిత్తం కొజికోడ్ వైద్య కళాశాలలో చేరనున్నట్టు తెలిపారు.
ఇటీవల తనని కలిసి వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం విజయన్ విజ్ఞప్తి చేశారు. మార్చి 3న విజయన్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, కేరళలో గడిచిన 24గంటల వ్యవధిలోనే 4353 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా సీఎం కరోనా బారినపడటంతో కేరళ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరిన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొనే అవకాశాలున్నాయి.