ప్రయివేటు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

ప్రవైటు టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి కరోనా భృతిని ప్రకటించారు. నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌, వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.


కరోనా కాటుకు ఎక్కువగా ఇబ్బందిపడిన వారిలో ప్రయివేటు టీచర్లు ఒకరు. గత యేడాది వారికి జీతభత్యాల్లేవ్. ఈ యేడాది కరోనా నిబంధనల మధ్య తెరచుకున్న విద్యాసంస్థలు.. ఒకట్రెండు నెలలు కూడా నడవక ముందే మళ్లీ మూతపడ్డాయి. దీంతో.. ప్రవైటు టీచర్ల గోస.. వర్ణారహితం అయింది. ఈ నేపథ్యంలో ప్రవైటు టీచర్లు ఇటీవల ఆందోళనకు కూడా దిగారు. థియేటర్లు, క్లబ్ లు, బార్లు.. తెరచుకోవచ్చు.. కానీ పాఠశాలలు ఎందుకు తెరవకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. వారిని బాధని అర్థం చేసుకున్న ప్రభుత్వం  మానవీయ దృక్పథంతో ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.