‘లెవన్త్ అవర్’ సూపర్ హిట్

‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ వంటి హిట్‌ చిత్రాలు అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన తొలిసారి ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. అది కూడా  ఆయన రాసిన  కథ కాదు. ప్రదీప్ అనే రచయిత‌ రాసిన కథ ఇది. ‘8 అవర్స్’‌ అనే బుక్‌ ఆధారంగా రచయిత ఈ కథని రాసుకొన్నారు.

కథానాయిక ప్రాధాన్య ఉన్నకథ ఇది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లెవన్త్ అవర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. భారీ అంచనాల మధ్య లెవన్త్ అవర్ ఆహా వేదికగా విడుదలైంది. పాజిటివ్ టాక్ కాదు.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.


రాత్రి 11గంటల నుంచి ఉదయం 8గంటల మధ్య సమయంలో నడిచే కథ ఇది. ఓ హోటల్‌ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ ని డీల్ చేసిన విధానం సూపర్భ్. మొత్తం 8 భాగాలుగా ఈ వెబ్ సిరీస్ ఉంది. కథ-కథనాలని గ్రిప్పింగ్ గా సాగాయి.

మొదటి నాలుగు భాగాలు ఓ విధంగా.. చివరి నాలుగు భాగాలు మరో పంథాలో సాగాయి. ఈ వెబ్ సిరీస్ ని చూడటం మొదలు పెడితే.. మొత్తం పూర్తయ్యేవరకు చూడక మానరు. అంతలా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంది. నటీనటుల నుంచి మంచి ఫర్ ఫామెన్స్ రాబట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ని కేవలం 33 రోజుల్లో తీశారంటే.. నమ్మశక్యంగా లేదు. అంత క్లారిటీ.. క్వాలిటీగా ఉంది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను.. లేడీ ఓరియెటెండ్ సినిమాకు ఫర్ ఫెక్ట్ గా సూటవుతానని ఈ వెబ్ సిరీస్ తో నిరూపించుకున్నారు తమ్మూ. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు క్లైమాక్స్ ని డీల్ చేసిన విధానం సూపర్భ్. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచేసింది. మొత్తానికి.. ‘లెవన్త్ అవర్’ సూపర్ హిట్.. మిల్కీబ్యూటీ ఇంకా బంపర్ హిట్టు.. !