రివ్యూ : వకీల్ సాబ్
చిత్రం : వకీల్ సాబ్ (2021)
నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : థమన్
దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాత : దిల్ రాజు, బోనీ కపూర్
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 9, 2021.
రేటింగ్ : 4/5
వకీల్ సాబ్ – ఆల్రెడీ హిట్టైన కథ. ఒకటి కాదు రెండు సార్లు. బాలీవుడ్ హిట్ ‘పింక్’కి రిమేక్ ఇది. ఆ తర్వాత అజిత్ హీరో కోలీవుడ్ లోకి రిమేక్ అయింది. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ.. ఇదే కథ ‘వకీల్ సాబ్’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫర్ ఫామెన్స్ మీద ఎవ్వరికీ సందేహం లేదు. ఆయన ఎలాగూ ఇరగదీస్తాడు. థమన్ మంచి సంగీతం అందించాడు. అది రిలీజ్ కి ముందే తెలిసిపోయింది. ఇక మిగిలిందల్లా.. పింక్ కథని తెగు నేటివిటికి తగ్గట్టుగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఎలా తీర్చిదిద్దారు. దాన్ని పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఎలా మలిచారు ? పింక్ మేజిక్ తెలుగులోనూ రిపీట్ అయిందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం.. పదండీ.. !!
కథ :
హైదరాబాద్ లో పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) ఉద్యోగాలు చేస్తుంటారు. ఓ రోజు నగరానికి దూరంగా కారు పాడవడంతో ఈ ముగ్గురు యువతులు ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) బంధువు వంశీతోపాటు మరో ఇద్దరు యువకులను కలుస్తారు. ప్రకృతి అనే రిస్టారుకు వెళ్లిన సమయంలో జరిగిన గొడవలో వంశీ గాయపడటం, ముగ్గురు యువతులు అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత ఎంపీ మనుషులు ముగ్గురు యువతులపై అక్రమ కేసులు బనాయిస్తారు. దీంతో ఈ ముగ్గురు యువతులు కోర్టులో సస్పెండైన వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కల్యాణ్) కలుస్తారు.
ఏ పరిస్థితుల్లో సత్యదేవ్‌ను ముగ్గురు అమ్మాయిలు సహాయం కోరుతారు. అసలు ప్రకృతి అనే రిసార్డులో వంశీ బ్యాచ్‌కు ముగ్గురు యువతులకు మధ్య ఏం జరిగింది? వంశీ తలకు బలమైన గాయం ఎందుకైంది. ఎంపీ రాజేంద్ర వర్గం ముగ్గురు యువతులపై ఎందుకు కేసులు పెట్టారు. ఈ కేసులో టాప్ లాయర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్)ను ఎందుకు రంగంలోకి దించాల్సి వచ్చింది? కోర్టులో రాజేంద్ర, సత్యదేవ్‌కు మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి. ఈ కథలో శృతి హాసన్ పాత్ర ఏంటీ ? చివరకు ఆ ముగ్గురు యువతులకు న్యాయం జరిగిందా ? అన్నది వకీల్ సాబ్ కథ.
ఎలా సాగింది ?
పింక్ కథని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా తెరకెక్కించడం అంటే కత్తి మీద సామే. కానీ ఆ పనిని ఫర్ ఫెక్ట్ గా చేశారు దర్శకుడు వేణు శ్రీరామ్. రాత-తీతలోనూ పింక్ ఫ్లేవర్ ఏమాత్రం మిస్ కానివ్వలేదు. పింక్ పక్కాగా ఎమోషనల్ కంటెంట్‌తో కొనసాగుతుంది.
కానీ వకీల్ సాబ్ విషయానికి వస్తే ఎమోషనల్ కంటెంట్, పవన్ కల్యాణ్ ఇమేజ్, తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలను జొప్పించి ఈ సినిమాను పక్కగా కమర్షియల్‌గా చేర్చారు. దీనికి బోనస్ అన్నట్టుగా పొలిటికల్ పంచులు బ్రహ్మండంగా పేలాయి. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయ్. హిందీ, తమిళ్ వర్షన్ కంటే వకీల్ సాబ్ గొప్పగా కనిపిస్తాడు. పవర్ ప్యాకెడ్ గా కనిపిస్తాడు. దర్శకుడిగా వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యారు.
ఎవరెలా చేశారంటే ?
పవన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ కు యాక్షన్ సీన్స్ కొత్తేమీ కాదు. అందులో ఎప్పటిలాగే ఇరగదీశాడు. అయితే లాయర్ గా ఆయన ఎటాక్ అదిరింది. ప్రకాష్-పవన్ కి మధ్య కోర్టులో వచ్చే సీన్స్ అదిరిపోయాయ్.
అదే సినిమాకు ప్రధాన బలం కూడా. అంతకుముందు కాలేజీ ఏపీసోడ్, లవ్ ఏపీసోడ్ లోనూ పవన్ జీవించేశారు. పవన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖుషి, గబ్బర్ సింగ్.. తర్వాత ఆ రేంజ్.. అంతకుమించి ఫర్ ఫామెన్స్ ఇచ్చారు పవన్. ప్రకాష్ రాజ్ మరోసారి నట విశ్వరూపాన్ని చూపించారు. ఆవేశంతోపాటు కఠినంగా వాదించే లాయర్‌గా ఆయన ఆకట్టుకొన్నారు.
ముగ్గురు అమ్మాయి. పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) చాలా బాగా నటించారు. పల్లవిగా నివేదా థామస్ చుట్టే కథ తిరిగినా.. జరీనాగా అంజలి ఫుల్ మార్కులు కొట్టేసింది. భావోద్వేగమైన పాత్రలో అద్భుతంగా నటించింది. కీలక సన్నివేశాల్లో అంజలి నటన మరో లెవెల్‌లో ఉంది.
నివేదా థామస్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. అలాగే అనన్య నాగళ్ల కూడా గిరిజన యువతిగా సానుభూతి పొందే క్యారెక్టర్‌లో నటించింది. అతిథి పాత్రకే పరిమితమైన శృతి గ్లామర్ గా కనిపించింది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
థమన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. సత్యమేవ జయతే, మగువా మగువా పాటలు తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయ్. ఎమోషనల్ గా సాగాయి. నేపథ్య సంగీతంలో థమన్ మేజిక్ చేశారు. అల.. వైకుంఠపురంలో తర్వాత థమన్ నుంచి వచ్చిన బెస్ట్ ఇది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- పవన్ నటన
- కథ-కథనం
- సంగీతం
- సెకాంఢాఫ్
మైనస్ పాయింట్స్ :- సినిమా ప్రారంభంలో కాస్త స్లోగా సాగడం
బాటమ్ లైన్ : వకీల్ సాబ్.. మరో ఖుషి.. మరో గబ్బర్ సింగ్ !
రేటింగ్ : 4/5 - నోట్ :
ఇది సమీక్షకుడి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.