చెన్నై జట్టులో ఓ మార్పు

ఆస్ట్రేలియా పేసర్‌ జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన హేజిల్‌వుడ్‌ స్థానంలో అతడిని తీసుకుంది. ఈ మేరకు లీగ్‌ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. బెరెన్‌డార్ఫ్‌కు ఇది రెండో ఐపీఎల్‌. 2019లో అతడు ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు. ఐదు మ్యాచులాడి ఐదు వికెట్లు తీశాడు. ఆసీస్‌ తరఫున 11 వన్డేలు, 7 టీ20లు ఆడిన అనుభవం అతడి సొంతం. 

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఇక మరికసేపట్లో ఐపీఎల్ 14 లో తొలి మ్యాచ్ ముంబై-బెంగూళురు మధ్య ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలిపోరులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఢీకొనబోతుండతం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఐపీఎల్ లో కోహ్లీ కంటే రోహిత్ టీమ్ రికార్డ్ మెరుగ్గా ఉన్న సంగతి తెలిసిందే.