ప్రైవేట్ టీచర్లకు కరోనా సాయం ఈ నెల నుంచే !
కరోనా విజృంభణతో తెలంగాణలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి సంగతి తెలిసిందే. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు వారికి రూ. 2000 ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సాయాన్ని ఈ నెల నుంచే అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేశారు. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో జిల్లా కలెక్టర్లు ఉన్నారు.