పవన్ తో అనసూయ రొమాన్స్

హాట్ యాంకర్ అనసూయ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసింది. ఆయనతో రచ్చ చేయబోతున్నా. దాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ఫ్యాన్స్ ని ఉడికిస్తోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నటించిన వకీల్ సాబ్ నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వకీల్ సాబ్ కాదు.. వసూల్ సాబ్ అని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ని ఊరించి.. ఉడికిస్తోంది హాట్ యాంకర్ అనసూయ. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి ర‌చ్చ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, చూసేందుకు అభిమానులు రెడీగా ఉండండి. ఆ సంద‌డి మీకు చూపించాల‌ని చాలా ఆతృత‌గా ఉంద‌ని చెప్పుకొచ్చారు. 

ప‌వ‌న్ హీరోగా డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్క‌నున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో అన‌సూయ కీల‌క‌పాత్ర పోషించనుందనే ప్రచారం ఉంది. ఇందులో ఆమె పవన్ తో రొమాన్స్ చేస్తారా ? లేక ఐటమ్ నెంబర్ లో మెరుస్తారా ? అన్నది తెరపై చూడాలి.