‘వకీల్ సాబ్’కు షాకిచ్చిన హైకోర్టు
ఏపీలో వకీల్ సాబ్ కు షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుని హైకోర్టు రద్దు చేసింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన వకీల్ సాబ్ టికెట్ ధరలని మూడ్రోజుల పాటు పెంచుకునేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది. రెండ్రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలు చేసింది. దీంతో.. రేపటి నుంచి వకీల్ సాబ్ టికెట్ ధరలని పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇక నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు.
అయితే ఏపీలో స్పెషల్ షోస్ రద్దు వలన జిల్లాకో రూ. 5కోట్లు.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకొంటే రూ. 50ల నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు.. టికెట్ ధరలపై కోర్టుకెళ్లిన ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ ని భారీగా డ్యామేజ్ చేయనుంది.