కరనా ఉదృతి.. ఒక్కరోజే 839 మృతి !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,52,879 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 839 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది. కొత్తగా 90,584మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,20,81,443కు చేరి.. రికవరీ రేటు 90.80శాతానికి తగ్గింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,69,275కి చేరింది. ఇక మరణాల రేటు 1.28 శాతానికి చేరింది.
మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షల విధిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున లాక్డౌన్ విధించే అవకాశమున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ ప్రభుత్వం శనివారం పలు కఠిన ఆంక్షలు విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు 50శాతం సీట్ల సామర్థ్యంలోనే నడుస్తాయి. వివాహ వేడుకల అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. రెస్టరెంట్లు, బార్లు సైతం 50శాతం సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టం చేశారు.