బ్రేకింగ్ : హోం క్వారంటైన్ లోకి పవన్ కల్యాణ్

వకీల్ సాబ్ హిట్ కిక్కులో ఉన్న పవర్ స్టార్ అభిమానులకి బ్యాడ్ న్యూస్. పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అలాగని ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ కాలేదు. అయితే పవన్ ముఖ్య కార్వ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు పవన్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్ చేసింది.

ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇందులో పవన్ నటనకు ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఫిదా అవుతోంది. పవర్ ప్యాకెడ్ నటన. లాయర్ పాత్రలో పవన్ అదరగొట్టేశారని కితాబిస్తున్నారు. వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. తొలిరోజే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసిన వకీల్ సాబ్ కు భారీ లాభాలు ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

క్వారంటైన్ లో శ్రీ పవన్ కల్యాణ్ గారు pic.twitter.com/bCu4bbXeQt— L.VENUGOPAL (@venupro) April 11, 2021