సన్ రైజర్స్ ఓటమికి కారణమిదే.. !
ఐపీఎల్ 14లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభారంభం లభించలేదు. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో SRH ఓడించి. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నితీశ్ రాణా(80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకాలతో చెలరేగారు. దినేశ్ కార్తీక్ (22; 9 బంతుల్లో 2×4, 1×6) ఆఖర్లో దంచి కొట్టాడు. ఫలితంగా కెకెఆర్ 187 పరుగుల భారీస్కోర్ చేయగలిగింది.
ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మనీశ్ పాండే (నాటౌట్) 61, బెయిర్‌స్టో 55 రాణించారు. ఆఖరులో అబ్దుల్ సమద్ (నాటౌట్) 19 పోరాడే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.
బౌలింగ్ నే సన్ రైజర్స్ ప్రధాన బలం. ఐపీఎల్ లో టాప్ జట్లని కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేసిన.. చరిత్ర సన్ రైజర్స్ కు ఉంది. అయితే ఆదివారం మ్యాచ్ లో సన్ రైజర్స్ ప్రధాన బౌలర్ అయిన భువనేశ్వర్ 4-0-45-1) దారళంగా పరుగులిచ్చాడు. ఒక్క రషీద్ ఖాన్ 4-0-24-2 తప్ప.. మిగతా బౌలర్లు సందీప్ శర్మ 3-0-35-0, నటరాజన్ 4-0-37-1, మహ్మద్ నబీ 4-0-32-2, , విజయ్ శంకర్ 1-0-14-0 ఎక్కువగా పరుగులు ఇవ్వడమే.. సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.