పవన్ క్వారంటైన్.. పొలిటికల్ డౌట్స్ !
జనసేన అధినేత, పవర్ పవన్ కల్యాణ్ సడెన్ గా క్వారంటైన్ లోకి వెళ్లినట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణయింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు పవన్ క్వారంటైన్ లోకి వెళ్లారని నిన్న సాయంత్రం జనసేన పార్టీ పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేసింది.
వాస్తవానికి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని మాత్రమే ఐసోలేషన్‌కు పంపుతున్నారు. వారి కాంటాక్ట్స్‌ను టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తున్నారు కానీ క్వారంటైన్‌కు వెళ్లాలని చెప్పడం లేదు. ఇక్కడే పవన్ క్వారంటైన్ పై అనుమానాలొస్తున్నాయ్. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో.. భాజాపాకు షాక్ ఇచ్చేందుకే పవన్ క్వారంటైన్ స్క్రిప్ట్ అనే ప్రచారం ఉంది.
ఈ మధ్య భాజాపా-జనసేన ధోస్తానా కొంత వీక్ అయింది. తిరుపతి సీటుపై జనసేనకు భారీ ఆశలే ఉన్నాయి. కానీ అవి తీరలేదు. ఆ సీటుని భాజాపానే తీసుకొంది. పోనీ.. ప్రచారం ఏమైనా సీరియస్ గా చేస్తుందా ? అంటే.. అదీ లేదు. కేంద్ర పెద్దలు రావడం లేదు. అమిత్ షా, మోడీ ఇటు వైపు చూసేలా లేరు. పవన్ ఒక్కరే.. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తుంటే.. భాజాపా నేతలు మాత్రం సినిమా చూస్తున్నారు. ఇక వకీల్ సాబ్ కు ఏపీలో జరిగిన అనుమానం అంతా.. ఇంతా కాదు.
ఏపీలో వకీల్ సాబ్ ని స్పెషల్ షోస్ ని, రేట్ల పెరుగుదలని అడ్డుకుంటే ఏపీ భాజాపా నేతలు ఏమీ చేయలేకపోయారు. నిజానికి.. భాజాపా నేతలు చెబితే సీఎం జగన్ వింటారు. కేంద్రంతో జగన్ ని ఉండే పని ముందు వకీల్ సాబ్ రేట్స్ పెరుగుదల లెక్కనే కాదు. కానీ.. ఆ దిశగా ఒత్తిడి చేయలేకపోయారు ఏపీ భాజాపా నేతలు. ఇవన్నీ మనసులో పెట్టుకొనే.. పవన్ క్వారంటైన్ కథ అల్లాడనేది పొలిటికల్ టాక్.