సాగర్ లో కేసీఆర్ సభకు లైన్ క్లియర్.. కానీ !
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయ్. ఇక్కడ గెలుపుకోసం తెరాస, కాంగ్రెస్, భాజాపాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయ్. ఎప్పటికప్పుడు పొలిటికల్ వ్యూహాలని మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయ్. అయితే సాగర్ సీఎం కేసీఆర్ ఆఖరి పంచ్ ఇవ్వనున్నారు. ఈ నెల 14న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దాదాపు లక్ష మందితో ఈ సభని ప్లాన్ చేశాయి గులాభి శ్రేణులు.
మరోవైపు సీఎం సభపై రైతులు కోర్టుకెళ్లారు. సీఎం సభ ఏర్పాటు చేయబోతున్న పొలం తమదేనని.. తమ అనుమతి తీసుకోకుండా సభ ఏర్పాటు చేస్తున్నారంటూ కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. ఈ కారణంగా సభకు ఆటంకాలు తీరిపోయినట్లే. మరోవైపు.. బీసీ సంఘాల పేరుతో కేసీఆర్ సభ రద్దు చేయాలని హెచ్ఆర్సీలో మరో పిటిషన్ దాఖలయింది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా సభ ఏర్పాటు చేస్తున్నారని…సభకు అనుమతి ఇవ్వొద్దని ఫిర్యాదులో కోరారు. ఈ పిటిషన్లు సీఎం కేసీఆర్ బహిరంగ సభని ఆపేలాలేవు.
కానీ రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ అవసరమా ? అది కూడా దాదాపు లక్ష మందితో అంటే.. కరోనా నిబంధనలని తుంగలో తొక్కడం ఖాయం అంటున్నారు సామాన్యులు. కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దు అంటున్న ప్రభుత్వం.. లక్ష మందితో సభ ఎలా పెడుతోందని వాదిస్తున్నారు.