మరోసారి ఓటీటీనే దిక్కు
గత యేడాది కరోనా లాక్ డౌన్ తో టాలీవుడ్ తల్లిడిల్లిపోయింది. ఓటీటీకి వెళ్లాలా ? థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు ఆగాలా ? అనే కన్ఫూజన్ లో ఉంది. అయితే కొందరు ఓటీటీకి వెళ్లారు. మరికొందరు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఈ సారి లాక్ డౌన్ లేదు. థియేటర్స్ మూతపడవు. కాకపోతే 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన రావొచ్చు. అయితే ప్రేక్షకులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా థియేటర్స్ కి రావడం తగ్గిస్తున్నారు.
ఇది ముందే గ్రహించిన దర్శక-నిర్మాతలు వచ్చే వారం సినిమాల రిలీజ్ ని వాయిదా వేసుకుంటున్నారు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్.. బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. ఈసారి మాత్రం సినీ పరిశ్రమలో కన్ఫూజన్ లేదు. మరో ఆలోచన లేకుండా ఓటీటీ వైపు వెళ్లవచ్చు. ఓటీటీ సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయ్. అవార్డులు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సినీ పరిశ్రమకు ఓటీటీనే దిక్కు కానుంది.