వకీల్ సాబ్ హిట్.. టాలీవుడ్ షెడ్యూల్ మారిందోచ్ !

వకీల్ సాబ్ హిట్ తో టాలీవుడ్ లెక్కలు మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఏంటీ ? అన్నది మాత్రం నిన్నటి దాక క్లారిటీ లేని విషయం. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మహేష్ నెక్ట్స్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. తారక్ తో కొరటాల శివ సినిమా ఫిక్సయింది. మరీ బన్నీ సంగతి ఏంటీ అంటే ? ఆయన వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఓకే చెప్పేశారు. ఈ షెడ్యూల్.. లెక్కలు మారడానికి ఏకైక కారణం వకీల్ సాబ్ పవన్ కల్యాణ్ నే. ఎందుకంటే ?


‘పుష్ప’ కంటే ముందే ‘ఐకాన్’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు బన్నీ. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాతగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇంతలో సుకుమార్ దూసుకొచ్చారు. బన్నీతో పుష్ప సినిమా ప్రకటించారు. ఐకాన్ కంటే ముందే సెట్స్ పైకి తీసుకెళ్లారు. పుష్ప తర్వాత ఐకాన్ ఉంటుంది అనుకుంటే.. కొరటాల శివ సినిమాని లైన్ లో పెట్టేశారు బన్నీ. దీంతో ఐకాన్ అటకెక్కినట్టే అనుకున్నారంతా. అయితే వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ తో వేణు శ్రీరామ్ పై బన్నీకి నమ్మకం పెరిగింది. ఇదీగాకా… పుష్ప డిసెంబర్ వరకు రాదని క్లారిటీ వచ్చేసింది. దీంతో బన్నీ చకచకా పావులు కదిపాడు.

కొరటాల శివని తారక్ కి ఇచ్చేశాడు. కొరటాల దగ్గర తారక్ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంది. బన్నీ ఏమో ఐకాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వేణు శ్రీరామ్ దగ్గర ఐకాన్స్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇక త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహెష్ దగ్గరకు వెళ్లిపోయాడు. ఆయన దగ్గర మహేష్ కోసం ఓ లైన్ ఉంది. సర్కారు వారి పాట పూర్తయ్యేలోపు.. ఆ లైన్ ని స్క్రిప్ట్ గా మార్చనున్నారు త్రివిక్రమ్. మొత్తానికి.. వకీల్ సాబ్  హిట్.. స్టార్ హీరోల సినిమాల షెడ్యూల్ ని మార్చేసింది.