తారక్-కొరటాల శివ సినిమా అప్ డేటు

‘జనతా గ్యారేజ్’ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. తారక్-కొరటాల కాంబోలో సినిమా ఫిక్సయింది. మరికాసేపట్లో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుంది. కొరటాల స్నేహితుడు సుధాకర్ స్వంత బ్యానర్ అయిన యువ సుధ తో కలిసి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భాగస్వామ్యంలో ఈ సినిమా రాబోతుంది.

కొరటాల శివ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా వున్నారు.  ఆచార్య బాధ్యతల నుంచి కొరటాల, ఆర్ఆర్ఆర్ బాధ్యతల నుంచి ఎన్టీఆర్ బయటకు రాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.ఈ కథలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటీ? ఈసారి కొరటాల చెప్పబోతున్న మెసేజ్ ఏంటీ అన్న వివరాలు తెలియాల్సి ఉంది. మరికాసేపట్లో రాబోతున్న ప్రకటనలోనూ తారక్ తో కొరటాల సినిమా ఫిక్స్… ఏ బ్యానర్ లో అన్నది మాత్రమే ప్రకటించనున్నారు. మిగితా వివరాల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.