తారక్-కొరటాల.. పాన్ ఇండియా సినిమా !

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా అప్ డేట్ వచ్చేసింది. ట్విట్టర్ వేదికగా కొరటాల #NTR30 అప్ డేట్ ఇచ్చారు.  ‘ఎన్టీఆర్ తో మరోసారి సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. గతంలో లోకల్ గా రిపేర్లు చేశాం.. ఐతే ఈసారి మాత్రం బౌండరీస్ క్రాస్ చేయబోతున్నాం’ అంటూ ట్విట్ చేశారు.

ముందే చెప్పినట్టుగా..  కొరటాల స్నేహితుడు సుధాకర్ స్వంత బ్యానర్ అయిన యువసుధ తో కలిసి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భాగస్వామ్యంలో ఈ సినిమా రాబోతుంది. సినిమా ప్రకటనతో పాటు రిలీజ్ డేటు కూడా ప్రకటించడం విశేషం. వచ్చే యేడాది 29న సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండాల్సి ఉంది. అనూహ్యంగా తారక్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయింది. తారక్-కొరటాల శివ సినిమా ఫిక్సయింది. ఇఅక్ త్రివిక్రమ్-మహేష్ తో సినిమా చేయబోతున్నారు. బన్నీ వేణు శ్రీరామ్ తో ఐకాన్ కి ఫిక్సయ్యారు.