దారుణం : పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన 6గురు బలి
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలయ్యారు. కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి ఆర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చినట్టుగా తెలుస్తోంది.
మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్(2), బొమ్మిడి ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు. ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.