బలహీనతే.. బలంగా మార్చుకున్న RCB !
ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బలమైన జట్టు. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. బ్యాటింగ్ లో బలంగా కనిపించే ఆర్సీబీ.. బౌలింగ్ లో బలహీనంగా కనిపించేది. అయితే తాజా సీజన్ లో మాత్రం ఆర్సీబీ బౌలింగ్ ని పదనుగా మార్చుకుంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ నే ఇందుకు ఉదాహరణ.
గెలుపు ఆశలు దాదాపు లేని సమయంలో అనూహ్యంగా పుంజుకుని ఆర్సీబీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సేన 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. వార్నర్ (57; 37 బంతుల్లో 7×4, 1×6) మనీశ్ పాండే(38; 39 బంతుల్లో 4×2, 6×2) రాణించారు. ఐతే వీరిద్దరు అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన సన్‌రైజర్స్ 9 పరుగులే చేయడంతో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హర్షల్ పటేల్ 2, సిరాజ్ 2, జేమీసన్ 2, జేమీసన్ 1 వికెట్ పడగొట్టారు.