తెలంగాణలో సమ్మెదిశగా ఆర్టీసీ..!?
వేతన సవరణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ టీఎంయూ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 11 నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ యూనియన్ సిద్ధమవుతోందని ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. వేతన సవరణ ఫిట్ మెంట్ యాభైశాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి 14నెలలు గడిచినా వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారాయన. వేతనాలు సమయానికి రావడంలేదన్నారు. యాజమాన్యం వేతనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. అన్ని జిల్లాల డిపోల ఆర్టీసీ కార్మికులు, నాయకులతో టీఎంయూ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మె తప్పదని హెచ్చిరించింది.