కోహ్లీ ఆవేశం.. ఫైన్ తప్పదా ?
అగ్రెసివ్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ కెరాఫ్ అడ్రస్. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీకి కోపం వచ్చింది. ఈ మ్యాచులో విరాట్ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్ ఆడాడు.. గాల్లోకి లేచిన బంతిని లాంగ్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ విజయ్ శంకర్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు.
ఔటైన ఆవేశంలో కోహ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు అడ్వర్టైజ్మెంట్ కుషన్, కుర్చీని తన్నేశాడు. దీంతో.. రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ కోహ్లీని మందలించాడు. కాగా 2016లో ఇదే బెంగళూరుతో మ్యాచులో గౌతమ్ గంభీర్ ఇలాగే చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15% కోత విధించడం గమనార్హం. కోహ్లీకి మాత్రం వార్నింగ్ తో సరిపెట్టారు. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అనూహ్యంగా పుంజుకొని.. 6 పరుగుల తేడాతో గెలుపొందింది.