విమాన ప్రయాణాలపై కొత్త గైడ్ లైన్స్

దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 2లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు నిబంధనలని మరింత కట్టుదిట్టం చేస్తున్నాయ్. తాజాగా పశ్చిమ్‌బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన ప్రయాణాలపై బుధవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు విధిగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని సూచించింది. బోర్డింగ్‌కు 72 గంటలకు ముందుగా ఈ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం(నెగిటివ్‌ రిపోర్టు) చూపిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తామని పేర్కొంది.