వకీల్ సాబ్ నుంచి మరో గిఫ్ట్

వకీల్ సాబ్ నుంచి మరో గిఫ్ట్ రాబోతుంది. ‘మగువా.. మగువా..’ ఫీమేల్ వర్షన్ ని ఈ సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ఫైనల్ మిక్స్ పూర్తయిందని థమన్ ట్విట్ చేశాడు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ టాక్.. కలెక్షన్స్ తో వకీల్ సాబ్ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. వకీల్ సాబ్ వాదించడం.. వాయించడమూ.. రెండింటికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.


మరోవైపు చిత్రబృందం ప్రమోషన్స్ ని మాత్రం ఆపడం లేదు. ఇటీవలే సూపర్ ఉమెన్ పేరిట ఓ ప్రోమోని వదిలిన సంగతి తెలిసిందే. అది సూపర్ హిట్ అయింది. సూపర్ ఉమెన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతోంది. ఈ వేడి చల్లారక ముందే మగువా.. మగువా.. ఫీమేల్ వర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి.. వకీల్ సాబ్ కలెక్షన్స్ మరింత పెరిగేలా.. ప్రమోషన్స్ చేస్తున్నారు.