సాగర్ లో ఆఖరి పంచ్ ఎవరిది ?
నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో మరోసారి తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నెల 17నే పోలింగ్. ప్రచారానికి ఈరోజే ఆఖరు. దీంతో సాగర్ లో ప్రచారం పీక్స్ కి చేరింది. బుధవారం సీఎం కేసీఆర్ హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. తనదైన శైలిలో సాగర్ ఓటర్లని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
ఐతే కేసీఆర్ స్పీచ్ లో జానారెడ్డి పెద్దగా టార్గెట్ చేసినట్టు కనిపించలేదు. జానారెడ్డి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు సాగర్ లో చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. కానీ తనదైన మార్క్ మాటలతో జానాని కార్నర్ చేయలేదు. బహుశా.. ఆయన వయసు, అనుభవానికి ఇచ్చిన గౌరవం కావొచ్చు.
ఇక తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, తెలంగాణ ఉద్యమ సమయంలో పడిన కష్టాలని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తనకి జానారెడ్డి పెట్టిన బిక్ష సీఎం పదవి అని చెప్పుకుంటుర్రు. ఆ అవకాశం వస్తే.. జానారెడ్డి తనకెందుకు ఇస్తడు. ఆయనే సీఎం అవుతడని చెప్పుకొచ్చారు.
భరత్ విజయం సాధించిన తర్వాత అభివృద్ధి అంటే ఎలా వుంటదో చూపిస్తామని తెలిపారు. ఏడాదిన్నరలో నెల్లికల్ లిఫ్ట్ పనులు పూర్తిచేస్తామని, ఆ నీళ్లలో నియోజకవర్గ ప్రజలు గెంతులు వేసి కేరింతలు కొడుతుంటే చూడాలనేది తన కోరిక అన్నారు.
సాగర్ లో సీఎం కేసీఆర్ సభనే తెరాస ఆఖరి పంచ్ నా ? లేక.. సాగర్ ప్రజలకు ఏమైనా సంచలన హామీలు ఇస్తారా ?? అన్నది మరికొన్ని గంటల్లో తెలవనుంది. కాంగ్రెస్, భాజాపాలు మాత్రం ఈసారి ఆఖరి పంచ్ లు కొట్టేందుకు రెడీ అవుతున్నాయి. చివరిసారిగా తమకు ఓట్లు వేయాలని ఓటర్లు దేవుళ్లని వేడుకోనున్నాయి.