పవన్ తో రేణు.. ఏం చేసినా తప్పే !
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు రేణు దేశాయ్. నెటిజన్ల ప్రశ్నలకు ముక్కుసూటి సమాధానాలు కూడా చెబుతుంటారు. తాజాగా కూతురు ఆద్యతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చారామె. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ పవన్‌కల్యాణ్ గురించి ఏమైనా మాట్లాడగలరా? అని కోరారు.
రేణూ స్పందిస్తూ … ఆయన గురించి ఏం మాట్లాడమంటారు? నేను ఎప్పుడు లైవ్ లోకి వచ్చినా.. ఆయన గురించి కామెంట్స్ పెడతారు. అవి చదివి వాటిపై స్పందిస్తే.. రేణుకి ఏం పనిలేదు. ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతుందని మళ్లీ నన్నే తిడతారు. మీరు అడిగారని మాట్లాడితే నాపై కామెంట్లు చేస్తారు. అలాంటప్పుడు నేనేం చేయాలి. అందువల్లే లైవ్‌కి రావడం కష్టంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.