OLXలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు.. ఒక్కో వయల్ రేటు రూ.6వేల !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అనూహ్యంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో వరుసగా రెండోరోజు కొత్త కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. దీంతో దేశంలో కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
మరోవైపు రెమ్ డిసివిర్ లని ఏకంగా ఓఎల్ఎక్స్లో పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్ఎక్స్ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వయల్‌ను గరిష్ఠంగా రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరుగుతుండడంతో కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు.