మూడో రోజూ.. 2లక్షలు దాటిన కరోనా కేసులు !
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు రెండు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,34,692 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. నిన్న కరోనాతో 1,341 మంది మృతి చెందారు. ఒక్కరోజులో కరోనాతో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరులో ఒకరోజులో అత్యధికంగా 1200 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,75,649కు చేరింది. ఇక మరణాల రేటు 1.22శాతానికి చేరింది. కొత్తగా 1,23,354 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220 చేరి.. రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి.