ఏపీ కరోనా రిపోర్ట్ : 7,224 కేసులు, 15 మరణాలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. తాజాగా ఏపీ కరోనా రిపోర్ట్ వచ్చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,224 కేసులు నమోదు కాగా.. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,55,455 కేసులు నమోదయ్యాయ్. ఇక మృతుల సంఖ్య 7,388కి చేరింది. 


నిన్న 2,332 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,07,598కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,469 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 1,051, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లేవ్. కరోనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపైనే ఏపీ సీఎం జగన్ దృష్టి సారించినట్టు కనబడుతోంది.