ఐకాన్.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది !
ఐకాన్ – వేణు శ్రీరామ్ – అల్లు అర్జున్ – దిల్ రాజు కాంబోలో ఫిక్సయిన చిత్రం. పుష్ప కంటే ముందే ఐకాన్ రావాల్సింది. కానీ అనూహ్యంగా సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బన్నీ. పుష్పని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. పుష్ప తర్వాత ఐకాన్ సినిమానే అనుకుంటే.. కొరటాల శివ సినిమాకు ఓకే చెప్పేశారు. అయితే వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత ఈక్వెషన్స్ మారాయ్. ఐకాన్ మళ్లీ తెరపైకి వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీతోనే ఐకాన్ ఉంటుందని వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బన్నీ కూడా అప్పుడే ఐకాన్ స్టార్ గా పేరు మార్చుకున్నారు. పుష్ప టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ గా పిలిపించుకున్నారు. ఈ విషయం పక్కనపెడితే తాజాగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. మరోసారి ఐకాన్ పై క్లారిటీ ఇచ్చారు. “మా బ్యానర్‌లో తదుపరి చిత్రం ‘ఐకాన్’. ఆ కథ నా మనసుకు బాగా నచ్చింది. వేణు కథ చెప్పిన దగ్గరి నుంచి దానితోనే ప్రయాణం చేశాం. స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇతర కారణాల వల్ల కాస్త ముందూ వెనుక అవుతుందంతే.. త్వరలోనే ప్రారంభిస్తాం” అన్నారు. దీంతో ఐకాన్ పై ఫుల్ క్లారిటీ వచ్చినట్టయింది.
మరోవైపు కొరటాల శివ – బన్నీ సినిమా వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న కొరటాల.. తన తదుపరి సినిమాని యంగ్ టైగర్ ఎన్ టీఆర్ తో చేయనున్నారు. ఇక తారక్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ మహేష్ తో ఫిక్సయ్యాడు. నెక్ట్స్ కొరటాలతో సినిమా అనుకున్న బన్నీ.. వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’కి ఓకే చెప్పారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారాలన్న తన కోరికని కూడా పూర్తిస్థాయిలో తీర్చుకోబోతున్నారు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్.