సన్ రైజర్స్ సేమ్ సీన్ రిపీట్
ఐపీఎల్ 14లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని విచిత్ర పరిస్థితి. ఆ జట్టులో కేవలం ఇద్దరే ఇద్దరు బ్యాట్స్ మెన్స్ ఉన్నట్టున్నారు. వార్నర్, బెయిర్ స్టో మాత్రమే. వీరిద్దరు అవుటైతే.. మిగితా బ్యాట్స్ మెన్స్ పెలివియన్ కు క్యూ కట్టేస్తారు. అసలు వీరికి బ్యాట్ కూడా పట్టరాదు అన్నట్టు.. ఇది వరకెప్పుడు క్రికెట్ నే ఆడనట్టు అవుట్ అవుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 149 పరుగులని చేధించలేక.. కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గా వచ్చిన వార్నర్ 54, మనీశ్ పాండే 38 పరుగులు చేసిన 6 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. వార్నర్ అవుటైన తర్వాత మిగితా ఆటగాళ్లు పెలివియన్ క్యూ కట్టారు.
ఇక నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ని సన్ రైజర్స్ బౌలర్లు 150 పరుగులకి కట్టడి చేశారు. ఛేదనలో హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(43; 22 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్ వార్నర్(36; 34 బంతుల్లో 2×4, 2×6) శుభారంభం చేశారు. వీరిద్దరూ 7 ఓవర్లకే జట్టు స్కోరును 60 పరుగులు దాటించారు. అయితే, బెయిర్‌స్టో హిట్ వికెట్ అయ్యాక కాసేపటికే వార్నర్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మనీశ్ పాండే(2), విరాట్ సింగ్(11), అభిషేక్ శర్మ(7) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. విజయ్ శంకర్(28; 25 బంతుల్లో 2×6) బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి వరకు నిలవలేకపోయాడు. మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు.
మిగితా జట్లు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్త్గున్నాయి. దాదాపు అన్నీ జట్లలో 7,8వ వికెట్ వరకు బ్యాటింగ్ చేసే సత్తాగల ఆటగాళ్లు ఉన్నారు. చెన్నైని తీసుకుంటే.. ఆ జట్టులో ఆఖరి ఆటగాడి వరకు బ్యాటింగ్ నైపుణ్యం తెలిసినవారే. అలాంటిది.. సన్ రైజర్స్ లో మొదటి రెండు, మూడు వికెట్లు పడితే అంతే సంగతులు. బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్.. బ్యాటింగ్ లో భారీ మార్పులు అత్యవసరం. విలియమ్స్ సన్ లాంటి ఆటగాళ్లని రిజర్వ్డ్ బెంచ్ కే పరిమితం చేయడం మరీ.. దారుణం.