ఐసీయూలో మోత్కుపల్లి
తెలంగాణ భాజపా నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారమ్. కరోనాతో సోమాజీగూడలోని ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం నిన్న రాత్రి క్షీణించింది. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజూకి కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 5,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 15 మంది మరణించారు.