ఆయన రూ.10కోట్లు ఇవ్వాలి.. సీసీఎస్‌’లో నరేష్ ఫిర్యాదు !

నటుడు సీనియర్ నరేష్ పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్‌ తమకు రూ.10 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని హైదరాబాద్ సీసీఎస్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో నరేష్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

‘స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల పేరుతో లింగం శ్రీనివాస్‌ .. మా బిల్డర్స్‌ ఫియోనిక్స్‌తో అసోసియేట్‌ అయి సైనింగ్‌ అథారిటీగా ఉన్నాడు. మా కుటుంబంతో ఉన్న పరిచయంతో రూ.7.5కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకు తిరిగి చెల్లించలేదు. దీనిపై మూడ్రోజుల క్రితం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మాకు రూ.10 కోట్లు రావాలి. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు” అని నరేశ్‌ తెలిపారు.