పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయండి : లోకేష్

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆ లేఖని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన లోకేష్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం మంచిందన్నారు. విద్యార్థుల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి  నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమం అన్నారు.


“కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్ గారికి లేఖ రాసాను. జూన్ లో మన రాష్ట్రంలో 15 లక్షలకు పైగా విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం. ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలి” అంటూ లోకేష్ రాసుకొచ్చారు.

కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. జూన్ లో మన రాష్ట్రంలో 15 లక్షలకు పైగా విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది.(1/2) pic.twitter.com/i4ULAd8bCT— Lokesh Nara (@naralokesh) April 18, 2021

వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం.
ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలి.(2/2)— Lokesh Nara (@naralokesh) April 18, 2021