ఏపీలో 6,582 కేసులు, 22 మరణాలు !
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,582 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 22 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 44,686 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,343 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,09,941కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 1,171, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. మరోవైపు వాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయడంతోనే కరోనాని కట్టడి చేయొచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు.