వైరల్ : కారులో మాస్క్ పెట్టుకోలేదని అడిగితే.. పోలీసులపై ఢిల్లీ కపుల్స్ ఫైర్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశాయి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే. కారులో ఉన్న మాస్క్ తప్పనిసరిగా ధరించాలని రూల్స్ చెబుతున్నాయి. అయితే కారులో ప్రయాణిస్తూ.. మాస్క్ పెట్టుకొని దంపతులు ఏకంగా పోలీసుల పైకే ఎదురుదాడికి దిగిన సంఘటన ఢిల్లీలో జరిగింది.

కారులో ప్రయాణిస్తున్న కపుల్స్ ని మాక్స్ ఎందుకు పెట్టుకోలేదని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. మా కారులో మేమెందుకు మాస్క్ పెట్టుకోవాలి. నా భర్తకు లిప్ కిస్ ఇస్తా… అంటూ సదరు మహిళా వాదనకు దిగింది. కారుని పక్కకు ఆపి మరీ.. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులు వీడియో రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా సదరు మహిళా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడీ.. ఈ వీడియోని ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన జనాలు.. వీరు చదువుకున్న అజ్ఝానాలు అంటూ.. తిట్టిపోస్తున్నారు. అందుకే అంటారేమో.. చదువుకున్నవారి కంటే చదువుకోని వారే నయమని.. !  

Delhi couple, stopped for not wearing mask inside car, misbehaves with cops

“Why should I wear a mask in my car? What if I have to kiss my husband,” the woman was heard telling the cops. pic.twitter.com/avOQF2d7HD— Hindustan Times (@htTweets) April 19, 2021