కరోనా థర్డ్ వేవ్.. లక్షణాలు ఇలా ఉంటాయట !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తో కరోనా ఆగిపోదు. థర్డ్ వేవ్ కూడా రావొచ్చని చెబుతున్నారు. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. 

మూడో దశకు సంబంధించి హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు కొన్ని విశ్లేషణలు చేశారు. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని.. మురుగునీటి విశ్లేషణ ద్వారా నెల రోజుల్లో వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. మూడో వేవ్ రాకముందే.. దానిపై అప్రమత్తం అయితే నష్టాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. 

కరోనా మొదటి దశలో ఉన్నప్పుడే.. సెకండ్ వేవ్ పై అప్రమత్తం అయితే.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆక్సిన్ కొరత, మందుల కొరతని అధిగమించేవారమని.. ఇవే పొరపాట్లని కరోనా థర్డ్ వేవ్ విషయంలో చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు.