పువ్వాడకు కేటీఆర్ బర్త్ డే విషెస్

మంత్రి కేటీఆర్ లో ఓ ప్రత్యేక గుణం ఉంది. ఆయన ఎంత బిజీగా ఉన్నా.. స్నేహితులు, సన్నిహితులు, పార్టీ నేతల పుట్టినరోజుని మరిచిపోరు. బర్త్ డే రోజున వారిని విష్ చేస్తుంటారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పువ్వాడకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికాగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

“రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు !ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.

రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!

ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱

(ఫైల్ ఫోటో) pic.twitter.com/YlfOoh6icj— KTR (@KTRTRS) April 19, 2021